ఈ లోకంలో ఉండడం ఇష్టం లేదని.. నవ వధువు ఆత్మహత్య

72చూసినవారు
ఈ లోకంలో ఉండడం ఇష్టం లేదని.. నవ వధువు ఆత్మహత్య
పెళైన 17 రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. జగిత్యాల(D) మల్యాల(M) తక్కళ్లపల్లికి చెందిన కనక భాగ్యలక్ష్మి(24)కి మ్యాడంపల్లికి చెందిన ఉదయ్‌కిరణ్‌ తో ఆగస్టు 18న వివాహం జరిగింది. ఉదయ్‌కిరణ్‌ HYDలో కాపురం పెట్టాడు. భాగ్యలక్ష్మి తల్లిదండ్రులు సోమవారం కూతురును తక్కళ్లపల్లికి తీసుకొని వచ్చారు. ఈ క్రమంలో భాగ్యలక్ష్మి బుధవారం మధ్యాహ్నం బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె చేతిపై 'నేను ఎవరి వల్ల చనిపోవడం లేదు.. నాకే ఈ లోకంలో ఉండడం ఇష్టం లేదు అందుకే వెళ్లిపోతున్నా' అని రాసి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్