ప్రముఖ దర్శకుడు జయమురుగన్‌ కన్నుమూత

67చూసినవారు
ప్రముఖ దర్శకుడు జయమురుగన్‌ కన్నుమూత
ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత జయమురుగన్‌ కన్నుమూశారు. ఆయనకు శుక్రవారం రాత్రి గుండెపోటు వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1995లో మన్సూర్‌ అలీఖాన్‌ హీరోగా ‘సింధుబాద్‌’ని తెరకెక్కించారు. ఆ తర్వాత పాండ్యరాజన్‌- కనక జంటగా నటించిన ‘పురుషన్‌ ఎనక్కు అరసన్‌’ అనే మూవీని నిర్మించారు. ఈ చిత్రాల విజయంతో ‘రోజామలరే’, ‘అడడా ఎన్న అళగు’, ‘తీ ఇవన్‌’ వంటి చిత్రాలను స్వీయనిర్మాణ దర్శకత్వంలో రూపొందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్