AP: విజయవాడ కార్పొరేటర్ల సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ కార్యకర్తలను కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని జగన్ ఫైర్ అయ్యారు. "దొంగ కేసులు పెట్టడం తప్ప.. వారు ఏం పీకలేరు అని అన్నారు. అలాగే మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నాం. ఈ సారి 2.0 వేరుగా ఉంటుంది. కార్యకర్తల కోసం ఎలా పని చేస్తానో చూపిస్తా. వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన వారిని ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాం". అని జగన్ ధ్వజమెత్తారు.