నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. రెండు వేరియంట్లలో లాంచ్ చేసిన ఈ మొబైల్‌ను 50ఎంపీ సెల్ఫీ కెమెరాతో ప్రవేశపెట్టింది. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.27,999గా కంపెనీ నిర్ణయించింది. 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.29,999గా పేర్కొంది. బ్లాక్, గ్రే రంగుల్లో ఈ మొబైళ్లు లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఆగస్టు7 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది.