KCRకు నోటీసులు.. రేవంత్‌ కక్ష సాధింపులో భాగమే: ప్రశాంత్‌రెడ్డి

76చూసినవారు
KCRకు నోటీసులు.. రేవంత్‌ కక్ష సాధింపులో భాగమే: ప్రశాంత్‌రెడ్డి
TG: BRS అధినేత కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు సీఎం రేవంత్‌రెడ్డి కక్ష సాధింపులో భాగమేనని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. "కేసీఆర్‌ చట్టాన్ని గౌరవించి విచారణకు హాజరవుతున్నారు. కాంగ్రెస్‌, BJP కూడబలుక్కుని కుట్రలు చేస్తున్నాయి. కేసీఆర్‌ను ఎదుర్కోలేక నోటీసుల పేరుతో ఇబ్బందులు పెట్టే యత్నం చేస్తున్నారు. కేసులు విచారణలకు భయపడం.. ధైర్యంగా ఎదుర్కొంటాం." అని ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్