తెలంగాణ హైకోర్డు పరిధిలోని 1,673 టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సంబంధిత అధికారులు తెలిపారు. కోర్టు మాస్టర్/ పర్సనల్ సెక్రటరీస్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్ తదితర పోస్టులకు ఎంపికలు జరగనున్నాయి. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 31. వివరాలకు https://tshc.gov.inను చూడొచ్చు.