దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 7 నుంచి 21 వరకు దరఖాస్తులు స్వీకరణ జరగనుంది. మార్చి 31 వరకు 6-8 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. జనన, కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులను పరిశీలించి, లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థుల తొలి జాబితాను మార్చి 25న, రెండో జాబితా ఏప్రిల్ 2న, మూడో జాబితా ఏప్రిల్ 7న ప్రకటిస్తారు.