2,700 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

71చూసినవారు
2,700 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
న్యూఢిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం, మానవ వనరుల విభాగం దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో 2,700 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్లో జులై 14 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష, లోకల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. వెబ్ సైట్: https://www.pnbindia.in/home.aspx