లగచర్లలో ఇండస్ట్రియల్ పార్కు భూసేకరణకు నోటిఫికేషన్‌

62చూసినవారు
లగచర్లలో ఇండస్ట్రియల్ పార్కు భూసేకరణకు నోటిఫికేషన్‌
TG: బహుళార్థ పారిశ్రామిక పార్కు భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో మండలంలోని లగచర్లలో 110.32 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల భూసేకరణ కోసం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేశారు. రైతులు, స్థానికుల ఆందోళనల నేపథ్యంలో అంతకుముందు ఇక్కడ ఫార్మా విలేజ్‌ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను ఇటీవల ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్