ఎమ్మెల్సీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 10 వరకు నామినేషన్ల స్వీకరణ, 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. తెలంగాణలోని వరంగల్-ఖమ్మం-నల్గొండ, మెదక్-ఆదిలాబాద్-కరీంనగర్-నిజామాబాద్ టీచర్, మెదక్-ఆదిలాబాద్-కరీంనగర్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఏపీలోని ఉభయ గోదావరి-కృష్ణా-గుంటూరు పట్టభద్రుల, విజయనగరం-విశాఖ-శ్రీకాకుళం టీచర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.