కెనరా బ్యాంక్ దేశవ్యాప్తంగా రీజియన్ల వారీగా వివిధ శాఖల్లో 3000 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 20-28 ఏళ్ల మధ్య వయసు కలిగి ఏదైనా విభాగంలో డిగ్రీ పట్టా పొందిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. సెప్టెంబర్ 21 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఏ రాష్ట్రానికి దరఖాస్తు చేస్తున్నారో ఆ రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాష వచ్చి ఉండాలి. శిక్షణ కాలం ఒక సంవత్సరం పాటు ఉంటుంది.