స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 39,481 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. వాటిలో అత్యధికంగా BSFలో 15,654(పురుషులు-13,306, మహిళలు 2348), CRPFలో 11541 (పురుషులు 11,299, మహిళలు 242), CISF 7,145(6430, 715), ITBPలో 3,017, AR 1,248, 2 SSB, SSF, NCBలో ఉన్నాయి. NCBకి ఎంపికైన వారికి పే లెవల్-1(రూ.18000-56900), మిగతా వారికి పే లెవల్-3(రూ.21,700-69,100) జీతాలు ఉంటాయి. ఫీజు రూ.100 ఉంటుంది. దరఖాస్తు చేయడానికి ఈ వెబ్‌సైట్ https://ssc.gov.in/loginని క్లిక్ చేయండి.