ఏపీలోని గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఈసీ విడుదల చేసింది. ఇవాళ్టి నుంచీ నామినేషన్లు స్వీకరణ ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 10వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించవచ్చు. ఈ ఎన్నికలు ఫిబ్రవరి 27న జరగనుండగా.. మార్చి 3వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది.