ఇక ఒంటిమిట్టలోనూ ప్రతి రోజు అన్నదానం: సీఎం చంద్రబాబు

56చూసినవారు
ఇక ఒంటిమిట్టలోనూ ప్రతి రోజు అన్నదానం: సీఎం చంద్రబాబు
AP: కర్నూలు జిల్లా ఒంటిమిట్ట రామాలయంలో శుక్రవారం సీతారాముల కళ్యాణం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి హాజరయ్యారు. స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల దేవస్థానం మాదిరి ఒంటిమిట్ట ఆలయంలో కూడా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని టీటీడీని కోరినట్లు తెలిపారు. త్వరలో దానిపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్