JEE మెయిన్ సెషన్ 2 ఫైనల్ కీ ని NTA ఉదయం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వెబ్సైట్ నుంచి కీ ని NTA తొలగించింది. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. దీనికి కారణం మాత్రం ఇంకా తెలియలేదు. కాగా ఏప్రిల్ 2 నుంచి 9 వరకు రెండో విడత పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.