మహిళా అభిమానికి మాటిచ్చిన ఎన్టీఆర్‌ (వీడియో)

73చూసినవారు
అమెరికాలోని లాస్‌ ఏంజెలిస్‌లో ఏటా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రోత్సవం బియాండ్‌ ఫెస్ట్‌ లో ప్రదర్శించిన'దేవర' చిత్రాన్ని ఎన్టీఆర్ తన అభిమానులతో కలిసి వీక్షించారు. అనంతరం తారక్‌ను చూసేందుకు టోక్యో నుంచి లాస్‌ ఏంజెలిస్‌కు వచ్చిన ఓ మహిళా అభిమాని జపాన్‌లో మీ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారని.. తమ దేశానికి రమ్మని ఆహ్వానించింది. ‘మీ దేశానికి తప్పకుండా వస్తా’ అంటూ మహిళా అభిమానికి ఎన్టీఆర్‌ మాటిచ్చారు.

సంబంధిత పోస్ట్