హీరో ఎన్టీఆర్ నిన్న జరిగిన 'S/O విజయంతి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అభిమానుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయశాంతి మాట్లాడుతుండగా కొంతమంది అభిమానులు అదేపనిగా అరిచారు. దీంతో ఎన్టీఆర్ ‘నేను వెళ్లిపోనా?’ అంటూ స్టేజీ దిగడానికి సిద్ధమయ్యారు. విజయశాంతి సముదాయించడంతో ఆగిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.