TG: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ కాల్ చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మధ్యప్రదేశ్ చెందిన వారిగా గుర్తించారు. వారం రోజుల కిందట ఎమ్మెల్యే వీరేశంకు న్యూడ్ కాల్ చేశారు. ఫోన్ ఎత్తిన కొద్ది క్షణాల్లోనే స్క్రీన్ రికార్డ్ చేసి ఆ వీడియోను ఎమ్మెల్యేకు పంపి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే నకిరేకల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాల్ ఆధారంగా ప్రాంతాన్ని ట్రేస్ చేసి ఇవాళ ఉదయం నిందితులను అదుపులోకి తీసుకున్నారు.