డ్యూటీలో కోతి పిల్లతో రీల్స్ చేసిన నర్సులు.. సస్పెండ్(వీడియో)

66చూసినవారు
విధులు మరచి కోతి పిల్లతో రీల్స్ చేసిన నర్సులపై అధికారులు వేటు వేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని బహ్రైచ్ లో ప్రభుత్వ మహిళా ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. డ్యూటీ సమయంలో కొందరు నర్సులు కోతిపిల్లతో సరదాగా గడుపుతూ రీల్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ వ్యవహారంపై ఆస్పత్రి చీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డా. ఎం.ఎం.త్రిపాఠి స్పందించారు. వీడియోలో ఉన్న ఆరుగురు నర్సుల్ని జూలై 5న విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్