ప్రముఖ విద్యుత్తు ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ షేర్లు ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని తాకాయి. బ్లాక్‌డీల్ కారణంగా సోమవారం పెద్ద మొత్తంలో కంపెనీ షేర్లు చేతులు మారిన నేపథ్యంలో వాటి విలువ పతనమైంది. కంపెనీలో 0.8శాతం వాటాకు సమానమైన 44లక్షల షేర్లు రూ.44.1 వద్ద చేతులు మారాయి. దీంతో 6శాతం మేర పతనమై రూ.43.20 వద్ద కనిష్ఠాన్ని తాకాయి. అయితే ఈ బ్లాక్ డీల్ ద్వారా ఎవరు విక్రయించారనే వివరాలు మాత్రం తెలియరాలేదు.