మురికివాడలో పుట్టి తల్లిదండ్రులతో కలిసి బాల్యం నుంచే భిక్షాటన చేసిన పింకీ హర్యన్, ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్. 2004లో హిమాచల్ ప్రదేశ్‌లోని మెక్లియోడ్ గంజ్ వీధుల్లో యాచిస్తున్న పింకీని చూసిన టిబెటన్ సన్యాసి జమ్యాంగ్ మనసు చలించింది. జమ్యాంగ్ పింకీ తల్లిదండ్రులను ఒప్పించి తనని ధర్మశాలలోని స్కూలులో చేర్చారు. పింకీ బాగా చదువుకుని చైనాలోని ప్రతిష్ఠాత్మక వైద్య కళాశాలలో సీటు దక్కించుకొంది. ఎంబీబీఎస్ పట్టాతో ఇటీవలే ధర్మశాలకు తిరిగివచ్చింది.