మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి దూసుకెళ్తోంది. మహాయుతి కూటమి 219 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ కూటమి 52 చోట్ల ముందంజలో ఉంది. అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన కేకే సర్వే మరోసారి సంచలనం క్రియేట్ చేసింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 225 స్థానాలు, కాంగ్రెస్ కూటమి 56 సీట్లు, ఇతరులకు 7 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఈ అంచనాలకు తగ్గట్లు మహారాష్ట్ర ఫలితాలు వస్తున్నాయి.