తమిళనాడులోని మదురై జిల్లా వ్యాప్తంగా జల్లికట్టు పోటీలు జోరుగా సాగుతున్నాయి. అవన్యాపురంలో 1,100 ఎద్దులను అదపు చేయడానికి 900 మంది యువకులు పోటీ పడ్డారు. ఈ పోటీల్లో విలంగుడి ప్రాంతానికి చెందిన గోవుల కాపరి నవీర్ కుమార్ మృతి చెందగా 26 మందికి గాయాలయ్యాయి. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మదురై ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.