కర్ణాటకలోని హసన్ జిల్లా బేలూరు బస్టాండ్ వద్దనున్న పాడుబడిన బిల్డింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరికొందరు గాయపడ్డారు. ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషయంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుడిని అమర్‌నాథ్‌గా గుర్తించారు. బిల్డింగ్ కూలడం చూసి స్థానికులు భయాందోళన చెందారు. పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.