ఒలింపిక్స్‌లో సెమీఫైనల్ చేరుకున్న భారత హాకీ జట్టుకు షాక్ తగిలింది. భారత ప్లేయర్ అమిత్ రోహిదాస్‌పై ఒక మ్యాచ్ నిషేధాన్ని విధిస్తూ FIH నిర్ణయం తీసుకుంది. దీంతో మంగళవారం జరిగే సెమీఫైనల్‌కు అమిత్ దూరం కానున్నాడు. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో బ్రిటన్ ప్లేయర్ కల్నన్ తలకు అమిత్ హాకీ స్టిక్ తగిలింది. వెంటనే రిఫరీ రెడ్ కార్డ్ చూపించాడు. దీనిని హాకీ ఇండియా ఛాలెంజ్ చేసింది. దీనిపై నిర్ణయం ఇంకా రాలేదు.