TG: కామారెడ్డి జిల్లా, రామారెడ్డి సర్వీస్ రోడ్డుపై శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. సిద్దిపేట వైపు వెళ్లాల్సిన ఓ లారీ సిరిసిల్ల సర్వీస్ రోడ్డు వైపు దిగాల్సి ఉండగా పొరపాటున రామారెడ్డి సర్వీస్ రోడ్డుపై దిగి తిరిగి సిరిసిల్ల రోడ్డు వైపు వెళ్తుండగా వెనక నుంచి వేగంగా వస్తున్న మరొక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. మృతుడు ఓంకార్ పార్తీ, గాయపడిన వారు అఖిలేష్, మహేష్‌లు మధ్యప్రదేశ్‌కు చెందినవారు.