సిగాచీ పరిశ్రమలో కొనసాగుతున్న శిథిలాల తొలగింపు

0చూసినవారు
సిగాచీ పరిశ్రమలో కొనసాగుతున్న శిథిలాల తొలగింపు
TG: పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో శిథిలాల తొలగింపు ఆరో రోజుకు చేరుకుంది. ప్రమాద స్థలంలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌, హైడ్రా సిబ్బంది భవన శిథిలాలు తొలగిస్తున్నారు. ఈ ఘటనలో 39 మంది మృతి చెందగా.. ఇంకా 9 మంది కార్మికుల ఆచూకీ తెలియాల్సి ఉంది. 34 మంది డెడ్‌బాడీలను మాత్రమే గుర్తించగా గుర్తు తెలియని 5 మృతదేహాలు పటాన్‌చెరు ఆసుపత్రిలో ఉన్నాయి. వివిధ ఆసుపత్రుల్లో 23 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్