TG: ప్రజాపాలన దరఖాస్తులను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ చేయకపోవడంతో ఇళ్లు లేని పేదలు లబోదిబోమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2023 DEC 28 నుంచి 2024 JAN 6 వరకు వివిధ పథకాల మంజూరు కోసం ప్రజాపాలన పేరిట కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల కోసం కూడా దరఖాస్తును తీసుకున్నారు. ఇందులో కొన్ని దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. కేవలం ఆన్‌లైన్‌లో నమోదైన దరఖాస్తులనే ప్రస్తుతం సర్వేయర్లు పరిశీలిస్తున్నారు. దీంతో తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.