బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకల నిర్వహణపై రాష్ట్ర స్థాయి కార్యాచరణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ… డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను గౌరవించింది మాత్రమేనని అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి అన్నారు. అలాగే భారతరత్న ఇచ్చి పార్లమెంట్‌లో చిత్ర పటం పెట్టి గౌరవించామన్నారు. ఏనాడైనా కాంగ్రెస్ అంబేద్కర్‌ను పట్టించుకుందా అంటూ ఆమె ప్రశ్నించారు.