TG: కులగణనపై కులసంఘాల నేతలకు వివరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'కులగణనను దేశం మొత్తం చేయాలని రాహుల్‌గాంధీ డిమాండ్ చేస్తున్నారు. వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటామా?. BRS నేతలు సర్వేలో పాల్గొనరు.. అవహేళన మాత్రం చేస్తారు. సర్వేలో పాల్గొన్న వాళ్లకే కులగణనపై మాట్లాడే అవకాశం ఉంది' అని అన్నారు.