'ఆపరేషన్ కగార్' ఆపేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఆపరేషన్ కగార్ కొనసాగుతోందని అన్నారు. ఇటీవల కర్రెగుట్టల్లో చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ లో మొత్తం 31 మంది మావోయిస్టులను హతమార్చినట్లు పేర్కొన్నారు. 2024 జనవరిలో ప్రారంభమైన ఆపరేషన్ కగార్.. మార్చి 31, 2026 నాటికి దేశాన్ని నక్సలైట్ రహితంగా మార్చాలనే లక్ష్యంతో నడుస్తోందని వెల్లడించారు.