ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్‌లోని అణు స్థావరాలపై దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) చీఫ్ మేజర్ జనరల్ హొస్సేన్ సలామీ, సైనిక దళాల పర్యవేక్షకుడు జనరల్ మహమ్మద్ బాఘేరి, దేశ క్షిపణి కార్యక్రమ అధిపతి జనరల్ అమీర్ అలీ హాజీజదే మృతి చెందారు. తాజాగా మరో ఇద్దరు అధికారులు ఘోలంరెజా మెహ్రాబీ, మెహ్దీ రబ్బానీలు మృతిచెందినట్లు ఇరాన్ సమాచారం.