ఆపరేషన్‌ సింధూర్‌ దాడులు పూర్తి విజయవంతం: కేంద్రం

57చూసినవారు
ఆపరేషన్‌ సింధూర్‌ దాడులు పూర్తి విజయవంతం: కేంద్రం
ఆపరేషన్‌ సింధూర్‌ దాడులు పూర్తిగా విజయవంతమైనట్లు కేంద్రం బుధవారం వెల్లడించింది. భారత్ ఆస్తులకు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది. "పాక్‌లోని కీలక వైమానిక స్థావరాలపై దాడులు చేశాం. దీనికి సంబంధించిన శాటిలైట్‌ చిత్రాలు కూడా ఉన్నాయి. 9 కీలక ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి. వందమందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. మరోసారి దాడికి దిగితే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాలని..పాకిస్తాన్‌ను మోదీ హెచ్చరించారు." అని కేంద్రం పేర్కొంది.

సంబంధిత పోస్ట్