భారత రైల్వే శాఖ దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో దేశభక్తి గీతాలతో #ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ఘనంగా జరుపుకుంటోంది. భారత సాయుధ దళాల సాహసాన్ని గుర్తిస్తూ, ఆపరేషన్ సిందూర్‌లో దేశ భద్రత కోసం పోరాడిన వీరుల ధైర్యాన్ని ఘనంగా స్మరించుకుంటూ దేశభక్తి గీతాలను ప్రయాణికులకు వినిపిస్తుంది. "జై హింద్" అంటూ రైల్వే శాఖ ఓ వీడియోను సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేసింది.