తెలంగాణలో 12 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే మరో 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా, ఈ రోజు ఉదయాన్నే హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, బజారాహిల్స్, అత్తాపూర్, ఓల్డ్ సిటీ, మెహిదీపట్నంతో పాటు పలు చోట్ల వాన దంచి కొడుతుంది.