TG: బ్రెయిన్ డెడ్ అయిన ఓ ఆలయ పూజారి అవయవదానం.. నలుగురికి పునర్జన్మను ప్రసాదించింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మాధాపురానికి చెందిన భువనగిరి లక్ష్మీనారాయణ(48) ఓ ఆలయంలో పూజారిగా పని చేస్తున్నారు. ఈ నెల 16న ఆటోలో ప్రయాణిస్తుండగా చెట్టు విరిగి ఆయనపై పడింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యారు. కుటుంబ సభ్యుల అనుమతితో ఆయన గుండె, కాలేయం, కిడ్నీలు సేకరించి నలుగురికి అమర్చారు. ప్రాణదానం చేశారు.