ఇస్రో, NRSCలతో బుధవారం ఓయూ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. స్పేస్ టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం 5 సంవత్సరాల కాలపరిమితితో ఒప్పందం చేసుకున్నట్లు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. ఈ ఒప్పందంలో భాగంగా ఓయూ విద్యార్థులకు ఇంజినీరింగ్, టెక్నాలజీ విభాగంలో కొత్త డిగ్రీ, పీజీ కోర్సులు ప్రవేశ పెట్టనున్నట్లు ప్రకటించారు.