మతానికి మానవత్వం జోడిస్తేనే లోక కళ్యాణం సాకారం అవుతుందని, మతాన్ని రాజకీయాల కోసం వాడుకోవద్దని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. మతాలు వేరైనా దేవుళ్ళు వేరైనా సాటి మనిషిని ప్రేమించాలన్నారు. ఫలానా మతాన్ని ప్రేమించాలని చెప్పడం మూర్ఖత్వం అవుతుందని, మన దేశాన్ని లౌకిక రాజ్యాంగా మన పూర్వీకులు నిర్మించారని చెప్పారు. గురువారం సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో AP, TG పాస్టర్ల సమావేశానికి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.