బీసీలకు అన్యాయం చేసే ఆలోచన మా ప్రభుత్వానికి లేదు: మంత్రి పొన్నం

65చూసినవారు
బీసీలకు అన్యాయం చేసే ఆలోచన మా ప్రభుత్వానికి లేదు: మంత్రి పొన్నం
బీసీలకు అన్యాయం చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. 'కులగణన సర్వే వంద శాతం నిష్పాక్షికంగా నిర్వహించాం. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో వంద శాతం సర్వే జరిగింది. HYDలో కావాలనే కొంతమంది సర్వేలో పాల్గొనలేదు. నగరంలో ఇంకొందరు అయితే సర్వే అధికారులపై కావాలనే కుక్కలను వదిలారు. మా ప్రభుత్వం ఏ పని చేసినా చిత్తశుద్ధితో పూర్తి చేస్తుంది' అని మంత్రి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్