TG: రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద జడ్పీ పాఠశాల 150వ వార్షికోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పేదలకు ఉత్తమ, నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతోనే తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. గత పదేళ్లుగా యూనివర్సిటీలు భ్రష్టుపట్టిపోయాయని, తాము వచ్చాకే మళ్లీ గాడిలో పెడుతున్నామని వివరించారు. అందుకే, నిన్న ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయస్సు పెంచినట్లు తెలిపారు.