పేదోడి కోసం తమ ప్రభుత్వం పని చేస్తుంది: పొంగులేటి

82చూసినవారు
పేదోడి కోసం తమ ప్రభుత్వం పని చేస్తుంది: పొంగులేటి
తెలంగాణ ఆర్ధిక పరిస్థితి బాగా లేకపోయినా గత పాలకులు చేసిన అప్పుకు రూ.6500 కోట్లు అసలు, వడ్డీ కడుతూ పేదోడి కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని సహచర మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు విజయరమణారావు, రాజ్ ఠాకూర్ తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. PSను స్థానిక ఎమ్మెల్యే పట్టుబట్టి తీసుకురావడం సంతోషకరమని చెప్పారు.

సంబంధిత పోస్ట్