దేశంలో అత్యల్ప ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రం మనదే: సీఎం రేవంత్

61చూసినవారు
దేశంలో అత్యల్ప ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రం మనదే: సీఎం రేవంత్
కాంగ్రెస్ పాలనలో దేశంలోనే అత్యల్ప ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వ విధానాలకు ఇదే నిదర్శనమన్నారు. BRS పాలనలో తెలంగాణ దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం కలిగి ఉందన్నారు. ప్రజా ప్రభుత్వ పాలనలో మహిళలకు ఉచిత బస్సు, రూ.500కే LPG సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ వైద్యం, సన్న బియ్యం పంపిణీ వంటి సాహసోపేతమైన నిర్ణయాలతో మార్పు తీసుకొచ్చామని X వేదికగా రాసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్