న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో యంగ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. పాకిస్తాన్ ఆటగాడు కుష్ దిల్ భారీ షాట్ ఆడగా ఆ బంతిని క్యాచ్ పట్టుకునేందుకు రచిన్ రవీంద్ర ప్రయత్నం చేశాడు. ఇక్కడే ఆ బంతి వేగంగా వచ్చి రవీంద్ర తలకు బలంగా తాకింది. దీనికి ఫ్లడ్ లైట్ వెలుతురు సరిగా లేకపోవడమే కారణమని PCBపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.