నిజమైన స్నేహానికి నిదర్శనం పాకిస్థాన్: తుర్కియే

72చూసినవారు
నిజమైన స్నేహానికి నిదర్శనం పాకిస్థాన్: తుర్కియే
భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తర్వాత తుర్కియే అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ నిజమైన స్నేహానికి ప్రతీక అని అభివర్ణించారు. భవిష్యత్తులోనూ తమ మద్దతు పాక్‌కు కొనసాగుతుందని హామీ ఇచ్చారు. పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ను విలువైన మిత్రుడిగా ప్రశంసించారు. అయితే భారత్‌లో ‘బాయ్‌కాట్‌ తుర్కియే’ నినాదం ఊపందుకుంటున్న తరుణంలో ఎర్డోగాన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

సంబంధిత పోస్ట్