యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో జరిగిన ఇంటర్నేషనల్ లీగ్ T20 మ్యాచ్‌లో పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సోషల్ మీడియా స్టార్ డాలీ చాయ్‌వాలను కలిశాడు. డాలీ అక్తర్‌కి టీ ఇచ్చాడు. అక్తర్ డాలీని, తన బౌలింగ్ ఇష్టమా అని అడిగాడు. ‘ఏం చెప్పాలో నాకు తెలియదు. కానీ మీరు బౌలింగ్ చేసినప్పుడు.. బౌలింగ్ చేసినట్లుగా అనిపించదు. బాల్‌ను బ్యాటర్‌పైకి విసిరినట్లుగా అనిపిస్తుంది’ అని డాలీ అన్నాడు.