మళ్లీ కవ్వించిన పాక్.. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు

82చూసినవారు
మళ్లీ కవ్వించిన పాక్.. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు
పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వరుసగా 11వ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరీ, మెంధార్, నౌషేరా, సుందర్భనీ, అఖ్నూర్ వంటి నియంత్రణ రేఖ (LOC) వద్ద నిన్న రాత్రి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. దీంతో భారత సైన్యం సైతం ధీటుగా ప్రతిస్పందించి ఎదురుదాడికి దిగింది.

సంబంధిత పోస్ట్