తిరోగమనంలో పాక్ ఆర్థిక వ్యవస్థ

65చూసినవారు
తిరోగమనంలో పాక్ ఆర్థిక వ్యవస్థ
టీ పొడిని దిగుమతి చేసుకోవడానికి అప్పు చేయాల్సి వస్తోందని.. టీ వినియోగాన్ని తగ్గించాలని స్వయానా పాక్ ప్రణాళిక శాఖ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ చెప్పడం విశేషం. 2023లో పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 38.5 శాతానికి చేరింది. ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్లిపోయింది. విదేశీ మారకనిల్వలు భారీగా 370 కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్న కారణంగా ఎస్ఏటీఎఫ్ ఆ దేశాన్ని 'గ్రే లిస్ట్'లో పెట్టింది. దీంతో రుణాలు దొరకడం కష్టమైపోయింది.

సంబంధిత పోస్ట్