'ఆపరేషన్ సిందూర్'లో భాగంగా పాక్ ఉగ్ర స్థావరాలపై దాడి చేసి, సర్గోదా ఎయిర్‌బేస్ రన్‌వేను భారత్ నాశనం చేసింది. ఇదే స్థావరం 1965 భారత్-పాక్ యుద్ధంలో కీలకంగా మారింది. భారత్‌కు చెందిన స్క్వాడ్రన్ లీడర్ ఏబీ దేవయ్య వీరోచితంగా పోరాడిన ప్రదేశంగా చరిత్రలో నిలిచింది. దేవయ్య పాక్ ఎఫ్-104 స్టార్‌ఫైటర్‌తో గాలిలో తలపడుతూ 60 ఏళ్ల క్రితమే పాక్ గుండెల్లో గుబులు పుట్టించారు. ఈ ఘటలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.