ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా 9 ఉగ్రస్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. భారత్ జరిపిన వైమానిక దాడుల్లో 80 మందికిపైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు సమాచారం. మరోవైపు భారత సరిహద్దు గ్రామాల్లో పాక్ జరిపిన దాడుల్లో 10 మంది భారత పౌరులు మృతి చెందారు. అయితే భారత్ నిర్వహించిన వైమానిక దాడిపై పాక్ మీడియా మొసలి కన్నీరు కారుస్తోంది. అమాయక ప్రజలను ప్రాణాలు తీస్తున్నారని ఓ యాంకర్ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పారు. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.