దుబాయిలో తెలంగాణకు చెందిన ఇద్దరిని ఓ పాకిస్థానీ దారుణంగా నరికి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శుక్రవారం ఈ ఘటన జరిగింది. దుబాయిలోని ఓ బేకరీలో పనిచేస్తున్న నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన అష్టపు ప్రేమ్‌సాగర్ (40), నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ ను అదే బేకరీలో పనిచేసే ఓ పాకిస్థానీ నరికి చంపాడు. పని ఒత్తిడి, మత విద్వేషంతో వీరిద్దరిని చంపినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో మరో ఇద్దరు తెలుగువారు గాయపడినట్లు సమాచారం.